* ఐటీ విభాగంలో ఏర్పాటు చేయనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (నైపుణ్య కేంద్రం)లో సాఫ్ట్‌వేర్ కోర్సులకయ్యే వ్యయాన్ని ఐబీఎం భరిస్తుంది. కోర్సులు, పాఠ్యాంశాల రూపకల్పన, ఆధునాతన శిక్షణ ఇవ్వనుంది.
* విశాఖపట్నంలో మీడియా, వినోద రంగాల్లో కేంద్రాన్ని ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్, టీవీ అకాడమీ ఏర్పాటు చేస్తుంది. కోర్సులు, పాఠ్యాంశాల రూపకల్పన చేస్తుంది.
* ఉత్పత్తిలో ఆధునాతన సాంకేతికత, ఫుడ్ ఇన్నోవేషన్, ప్రాసెసింగ్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల విభాగాల్లో సింగపుర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ కోర్సులను అందిస్తుంది.