ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కవిత ఘన విజయం - kavitha latest news

తెలంగాణలో నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తెరాస విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి కవిత ఘన విజయం సాధించారు. మొత్తం 823 ఓట్లకు గానూ తెరాస 728 ఓట్లు కైవసం చేసుకోగా.. భాజపా 56, కాంగ్రెస్‌ 29 ఓట్లు దక్కించుకుంది.

MLC
MLC

By

Published : Oct 12, 2020, 12:54 PM IST

తెలంగాణలోని నిజామాబాద్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి కవిత ఘన విజయం సాధించారు. కౌంటింగ్​ మొదటి రౌండ్​లోనే కవిత భారీ ఆధిక్యం సాధించారు. తొలి రౌండ్​లో తెరాసకు 531 ఓట్లు నమోదవ్వగా.. భాజపా 39, కాంగ్రెస్​ 22 ఓట్లు సాధించాయి. చెల్లని ఓట్ల కింద 7 నమోదయ్యాయి. తర్వాత రెండో రౌండ్​కి వచ్చేసరికి తెరాస 728, భాజపా 56, కాంగ్రెస్​ 29 ఓట్లు రాగా.. 10 చెల్లకుండా పోయాయి.

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపును మొత్తం ఆరు టేబుళ్లపై రెండు రౌండ్లలో కౌంటింగ్​ ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఎన్నికలో మొత్తం 824 ఓట్లకు 823 ఓట్లు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:కొద్దిగంటల్లో తీవ్రంగా మారనున్న వాయుగుండం

ABOUT THE AUTHOR

...view details