ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెరుగుతున్న కరోనా... హైదరాబాద్​ హైరానా!

కరోనా నియంత్రణ కోసం అధికారులు ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ... కొవిడ్​-19 వ్యాప్తి ఆగడం లేదు. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కావడం వల్ల ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా 30 కేసులు నమోదయ్యాయి.

corona-positive-cases-are-on-the-rise-in-hyderabad
తాజాగా 30 కేసులు

By

Published : May 10, 2020, 9:55 AM IST

హైదరాబాద్​లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. ఒకరి నుంచి ఒకరికి కొవిడ్​-19 వ్యాప్తి చెందుతోంది. తాజాగా మరో 30 కేసులు నమోదవడం వల్ల ఆందోళన వ్యక్తమవుతోంది

నవజాత శిశువుకు నెగిటివ్‌...

గాంధీ ఆసుపత్రిలో కరోనా సోకిన మహిళకు శుక్రవారం జన్మించిన మగబిడ్డకు కరోనా లేదని తేలింది. నమూనాలు సేకరించి పరీక్షకు పంపగా నెగిటివ్‌ వచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు శనివారం తెలిపారు. నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలో ఇద్దరికి, కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విశ్రాంత హెడ్‌పోస్ట్‌మాస్టర్‌ (85)కు, అంబర్‌పేట చెన్నారెడ్డినగర్‌ కరోనా సోకిన కానిస్టేబుల్‌ ఇంటి పక్కన ఉండే ఇద్దరు మహిళలు (49), (22), బాలుడి (17)కి కరోనా నిర్ధారణ అయింది.

మూసాపేట్‌ సర్కిల్‌ అల్లాపూర్‌ డివిజన్‌ రాజీవ్‌గాంధీనగర్‌లో శుక్రవారం ఒక వ్యక్తికి కరోనా రాగా అతని కుటుంబంలో 11 మందికి అమీర్‌పేట్‌ నేచర్‌క్యూర్‌ ఆసుపత్రి క్యారంటైన్‌ కేంద్రంలో పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిలో శుక్రవారం 8 మందికి, మలక్‌పేట రేస్‌కోర్సు రోడ్డులో ఉంటున్న ఒంటరి మహిళకు, రహ్మత్‌నగర్‌ డివిజన్‌ హబీబ్‌ ఫాతిమానగర్‌ ఫేజ్‌-2 బస్తీకి చెందిన ఒక ఫైనాన్స్‌ వ్యాపారి (50)కి, వనస్థలిపురంలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. ఆరుగురు అనుమానితులకు ఫీవరాసుపత్రిలో శనివారం పరీక్షలు చేయగా కరోనా లక్షణాలు కనిపించాయి.

ఇక ఇళ్లే కంటెయిన్‌మెంట్లు...

నగరంలో కంటెయిన్‌మెంట్‌ జోన్‌ పరిధిని కుదించారు. మొదట్లో కిలోమీటరు పరిధి, ఆ తరవాత వంద ఇళ్ల పరిధిని కంటెయిన్‌మెంట్‌గా పరిగణించారు. ప్రస్తుతం పాజిటివ్‌ వచ్చినవారి ఇంటిని మాత్రమే కంటెయిన్‌మెంట్‌ ప్రాంతంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల జీహెచ్‌ఎంసీ శుక్రవారం నుంచి వైరస్‌ సోకిన బాధితుల ఇళ్లను మాత్రమే కంటెయిన్‌మెంట్‌గా ప్రకటించింది.

అందులో ఎవరినీ 14 రోజులపాటు బయటకు రాకుండా చూస్తారు. రెండు రోజులుగా 50 మంది ఇళ్లను కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా చేశారు. నగరంలో ప్రస్తుతం 18 జోన్లు ఉన్నాయన్నారు. వనస్థలిపురం, ఎల్బీనగర్‌ ప్రాంతంలో అధికంగా ఉన్నాయి.

ఇదీ చదవండి :

రాష్ట్రంలో1930 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details