వరుసగా 9వ రోజూ.. రాష్ట్రంలో కరోనా కేసులు 10 వేలకు పైగా నమోదయ్యాయి. ఇవాళ.. 10, 776 మందికి కోవిడ్ సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ నివేదిక తెలిపింది. వీటితో కలిపి.. 4, 76, 506కు కేసుల సంఖ్య పెరిగింది. గడచిన 24 గంటల్లో 76 మంది కోవిడ్ కారణంగా మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,276 కు చేరింది.
ఇన్ని కేసులు నమోదైనా.. ఇవాళ రాష్ట్రంలో ఏకంగా 12 వేల 334 మంది బాధితులు కోలుకోవడం.. సానుకూల పరిణామం. వీరితో కలిపి.. వైరస్ నుంచి క్షేమంగా బయటపడిన వారి సంఖ్య.. 3,70,163 కు పెరిగింది. ఈ ప్రకారం.. రాష్ట్రంలో ప్రస్తుతం 1,02,067 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక.. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల వ్యవధిలో 59,919 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తంగా పరీక్షల సంఖ్య 39, 65, 694 గా నమోదైంది.
జిల్లాల వారీగా నేడు నమోదైన మృతుల వివరాలు
జిల్లా | మృతులు |
చిత్తూరు | 9 |
ప్రకాశం | 9 |
గుంటూరు | 8 |
కడప | 8 |
నెల్లూరు | 8 |
తూర్పు గోదావరి | 6 |
పశ్చిమ గోదావరి | 6 |
విశాఖపట్నం | 6 |
కృష్ణా | 5 |
శ్రీకాకుళం | 4 |
అనంతపురం | 3 |
కర్నూలు | 2 |
విజయనగరం | 2 |
మొత్తం మృతులు | 76 |