ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో విస్తరిస్తోన్న కరోనా.. 404 కేసులు నమోదు - corona letste news

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 40 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు తెలంగాణలో ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 404 కి చేరింది. ఇందులో ఇప్పటికే 45మంది డిశ్చార్జి కాగా... 11మంది మృతి చెందారు.

Corona cases increased in state
తెలంగాణలో భారీగా పెరుగుతున్న పాజిటివ్​ కేసులు

By

Published : Apr 7, 2020, 8:52 AM IST

Updated : Apr 7, 2020, 9:27 PM IST

కరోనా వైరస్ తెలంగాణలో వేగంగా విస్తరిస్తోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 40 మందికి ఈ మహమ్మారి సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో 45 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జయ్యారు. 11మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసులు 348కు చేరింది. వీరిలో అత్యధికులు ఇటీవల దిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులే అని సమాచారం.

ఇప్పటివరకు

25 జిల్లాల్లో విస్తరించిన కరోనా..

తెలంగాణలో మొత్తం 25 జిల్లాల్లో కరోనా విస్తరించి ఉండగా... హైదరాబాద్​లో తగ్గుముఖం పట్టింది. నిజామాబాద్ జిల్లాలోనూ కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం నిజామాబాద్​లో కేవలం 19 పాజిటివ్ కేసులో ఉండగా.. సోమవారానికి ఆ సంఖ్య 26కి చేరింది. వరంగల్ అర్బన్​ జిల్లాలో 23 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఒకరు డిశ్చార్జయ్యారు. జోగులాంబలో తాజాగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 13కి చేరింది. మేడ్చల్​లోనూ.. ఆదివారం 12మందికి కరోనా ఉండగా... సోమవారానికి ఆ సంఖ్య 15కి చేరింది. మరో ఇద్దరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు.

పెరుగుతున్న కేసులు..

భద్రాద్రి కొత్తగూడెంలో ఇద్దరు డిశ్చార్జ్ కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 2కి తగ్గింది. మహబూబ్​నగర్​లో 3 కేసులు పెరగటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య 6కి చేరింది. మరొకరు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జయ్యారు. ఆదివారం జగిత్యాలలో పాజిటివ్ కేసు ఉండగా.. మరో రెండు అదనంగా పెరగి యాక్టివ్ కేసుల సంఖ్య 3కి చేరింది. జనగామ, నాగర్​కర్నూల్, పెద్దపల్లిలో ఒక్కో కేసు పెరగటం వల్ల ఆయా జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 2కి పెరిగింది. సూర్యాపేటలో ఆదివారం ఇద్దరిలో కరోనా ఉండగా.. అదనంగా ఆరుగురిలో కరోనా పాజిటివ్ వచ్చింది. యాక్టివ్ కేసుల సంఖ్య 8కి చేరింది. నిర్మల్ లోనూ 3 కేసులు పెరిగాయి.

కరోనా కేసులన్నీ గాంధీలోనే..

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ... వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జవుతున్న వారి సంఖ్య ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోందని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో కరోనాకి వినియోగించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇకపై తెలంగాణలో ఎక్కడ కరోనా పాజిటివ్ వచ్చినా... వారిని తక్షణం గాంధీకి తరలించాలని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఫలితంగా మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని భావిస్తోంది.

ఇవీ చూడండి:'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'

Last Updated : Apr 7, 2020, 9:27 PM IST

ABOUT THE AUTHOR

...view details