CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,184 కరోనా కేసులు.. 11 మరణాలు
16:40 September 26
CORONA CASES
రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 1,184 కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,333 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 13,048 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 58,545 కరోనా పరీక్షలు చేశారు. కరోనాతో చిత్తూరు జిల్లాలో మరో ముగ్గురు మృతి చెందారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
ఇదీ చదవండీ..Home Minister Sucharita: 'రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తగ్గింది'