CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 629 కరోనా కేసులు.. 8 మరణాలు - andhrapradhesh corona news
17:36 October 09
రాష్ట్రంలో 24 గంటల్లో 45,818 మందికి కరోనా పరీక్షలు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 45,818 మందికి కరోనా నిర్థరణ(corona tests) పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 629 కరోనా కేసులు(corona cases) నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 8మంది మృతి చెందినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నుంచి 797 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,134 కరోనా యాక్టివ్ కేసులు(active cases) ఉన్నాయి.
జిల్లాల వారీగా కేసులు, మృతులు
- అనంతపురంలో 7, చిత్తూరులో 104, తూర్పుగోదావరిలో 65, గుంటూరులో 91, కడపలో 44, కృష్ణాలో 75, కర్నూలులో 4, నెల్లూరులో 68, ప్రకాశంలో 53, శ్రీకాకుళంలో 16, విశాఖపట్నంలో 49, విజయనగరంలో 3, పశ్చిమగోదావరిలో 50 కరోనా కేసులు నమోదయ్యాయి.
- కరోనాతో ప్రకాశంలో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, చిత్తూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఇదీచదవండి.