Revanth reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విడుదల చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు ఘట్ కేసర్ పీఎస్ వద్దకు భారీ ఎత్తున తరలివచ్చారు. పోలీస్ స్టేషన్ గేట్లు తోసుకుంటూ లోపలికి దూసుకెళ్లారు. దీంతో పీఎస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి కొండా సురేఖ సైతం పీఎస్ వద్దకు చేరుకున్నారు. తెరాస ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పీఎస్ ముందు ధర్నా చేపట్టారు. రాకేశ్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తుండగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అందోళన చేపట్టారు. కీసర, ఉప్పల్, ఎల్బీనగర్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివస్తుండడంతో పోలీసులు అడ్డుకుంటున్నారు. మల్కాజిగిరి డీసీపీ రక్షిణమూర్తి ఘట్‌కేసర్ ఠాణాకు వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.