Rahul Gandhi Jodo Yatra: కర్ణాటక నుంచి శుక్రవారం ఉదయం ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలంలో విజయవంతంగా సాగింది. సాయంత్రం 6.15 గంటల రాహుల్ గాంధీ భారత్ ఐక్యత యాత్ర ఓబులాపురం చెక్ పోస్ట్ మీదుగా కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలోకి వెళ్ళింది. ఉదయం 9.30 నుంచి సాయంకాలం 6.30 వరకు 12 కి.మీ మేర ఆంధ్రప్రదేశ్‌లో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగింది. రాహుల్ గాంధీ పాదయాత్రలో పీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాత్రి కర్ణాటకలోని బళ్లారి జిల్లా అలకుందిలో రాహుల్ గాంధీ బస చేయనున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆంధ్ర సరిహద్దులో తమ అభిమాన నాయకుడికి ఘన స్వాగతం పలికారు.
Rahul Gandhi Jodo Yatra: అనంతపురంలో రాహుల్ భారత్ జోడో యాత్ర - Anantapur District latest updates
Rahul Gandhi Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన జోడో యాత్ర రాష్ట్రంలోకి కొనసాగింది. కేరళ నుంచి మొదలైన యాత్ర.. కర్ణాటక దాటి ఏపీలోకి చేరుకుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాల్ మండల సరిహద్దులో రాహుల్ గాంధీకి పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన యాత్ర.. అనంత జిల్లా మీదుగా కర్ణాటకలోకి ప్రవేశించింది.
రాహుల్‌గాంధీ జోడో యాత్ర
Last Updated : Oct 14, 2022, 9:12 PM IST