గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబయికి విమాన సర్వీసు ప్రారంభం కాబోతుంది. జనవరి 12 నుంచి వారానికి మూడు రోజులు ఈ విమాన సర్వీసు నడవనుంది. మంగళ, గురు, శనివారాల్లో నడిచే ఈ సర్వీసుకు ఇప్పటికే టిక్కెట్ల విక్రయం ప్రారంభమైందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం గన్నవరం నుంచి ముంబయికి విమాన సర్వీసులు లేవు. గతంలో ఎయిరిండియా, స్పైస్ జెట్ విమాన సర్వీసులు ముంబయికి కొన్నాళ్లు నడిపి ఆపేశారు. ప్రస్తుతం ఇండిగో విమానయాన సంస్థ ముంబయికి సర్వీసులు ప్రారంభిస్తోంది. ముంబయిలో ఉదయం 10.50 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.45గంటలకు విజయవాడకు వస్తుంది. విజయవాడ నుంచి మధ్యాహ్నం 1.30గం.కు బయలుదేరి సాయంత్రం 3.20గం.కు ముంబయికి చేరుతుంది.