థర్మల్ విద్యుత్ కేంద్రా(Thermal power plants)ల్లో బొగ్గు కొరత(coal shortage in india)కు పాత బకాయిలు కొండలా పేరుకుపోవడమూ ప్రధాన కారణాల్లో ఒకటని కేంద్ర నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గనుల నుంచి బొగ్గు కొంటున్న విద్యుత్ కేంద్రాల (Thermal power plants) యాజమాన్యాలు రూ.వందల కోట్ల సొమ్ము బాకీ పడ్డాయి. ఒక్క సింగరేణి గనులకే 5 రాష్ట్రాల యాజమాన్యాలు రూ.5 వేల కోట్ల వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దేశంలో కోల్ ఇండియా సహా పలు బొగ్గు గనులకు రావాల్సిన బకాయిలు రూ.వేల కోట్లకు చేరినట్లు అంచనా. బకాయిలు పెరగడం వల్ల ఏయే విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరాను గనులు తగ్గించాయనే సమాచారాన్ని కేంద్ర విద్యుత్‌శాఖ తాజాగా వెల్లడించింది.
నెలల తరబడి క్రమంగా సరఫరా తగ్గిస్తూ రావడం వల్ల పలు విద్యుత్ కేంద్రాల్లో నిల్వలు అడుగంటినట్లు(coal shortage in india) సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్‌లో విద్యుత్ కేంద్రాలకు (Thermal power plants) బొగ్గు కొరత(coal shortage in india) తీవ్రంగా ఉంది. కొన్ని ప్రధాన కేంద్రాలు బొగ్గు కొన్న సొమ్ము చెల్లించనందునే సరఫరా తగ్గినట్లు కేంద్ర విద్యుత్‌శాఖ స్పష్టం చేసింది. ఏపీలోని 3 కేంద్రాలు బొగ్గు కొన్న సొమ్మును సకాలంలో చెల్లించనందునే సరఫరా తక్కువగా ఉన్నట్లు తెలిపింది. తెలంగాణ థర్మల్ కేంద్రాలు (Thermal power plants) కూడా సింగరేణి సంస్థకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నా బొగ్గు సరఫరా కొనసాగుతోంది.