ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Reorganisation of districts in Andhra Pradesh: తెరపైకి జిల్లాల పునర్విభజన.. సీఎం జగన్ కీలక నిర్ణయం!

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన మరోసారి తెరపైకి(Reorganisation of districts in Andhra Pradesh) వచ్చింది. శుక్రవారం ఎంపీలతో సమావేశమైన సీఎం జగన్.. ఈ అంశంపై చర్చించినట్లు(CM Jagan on new districts) తెలుస్తోంది. ఈ ప్రక్రియను ప్రారంభించాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.

CM YS Jagan
Reorganisation of districts in Andhra Pradesh

By

Published : Nov 28, 2021, 8:14 AM IST

జిల్లాల పునర్విభజన ప్రక్రియ అంశం(Reorganisation of districts in Andhra Pradesh)పై శుక్రవారం సీఎంతో నిన్న జరిగిన ఎంపీల సమావేశంలో దీనిపై చర్చ (CM Jagan on new districts) జరిగినట్టు తెలుస్తోంది. జనగణనకు సంబంధించి కేంద్ర గణాంకశాఖ జారీ చేసిన ఆదేశాలకు ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియ ప్రారంభించాలంటూ ఉన్నతాధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలిచ్చినట్టు సమాచారం. జనగణన పూర్తయ్యేలోగా విభజనకు సంబంధించి ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేసి నోటిఫికేషన్కు సిద్ధం కావాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది.

వచ్చే ఏడాది జనవరి నుంచి జనగణన(census of India 2021) చేపట్టనున్న దృష్ట్యా ఈ ప్రక్రియను చేపట్టడంపై సీఎంఓ అధికారులు.. ముఖ్యమంత్రి​కి కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. అయితే కేంద్ర ఆదేశాలకు ఇబ్బంది లేకుండానే ఆర్థికేతర అంశాల్లో ప్రజాభిప్రాయ సేకరణలాంటి కార్యాచరణను చేపట్టాలని ఆదేశాలిచ్చినట్టు వెల్లడవుతోంది. దీనిపై ఏర్పాటు అయిన సీఎస్ కమిటీ, జిల్లా స్థాయి కమిటీలు కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. అటు సీసీఎల్​ఏ కూడా జిల్లాల ఏర్పాటు లో ఉన్న అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించింది. దాదాపుగా 2 వేల కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని కూడా రాష్ట్ర స్థాయి కమిటీ ప్రభుత్వానికి గతంలోనే నివేదించింది. పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రాథమిక స్థాయిలో ఈ కసరత్తును పూర్తి చేశారు. ఏడాది క్రితమే జిల్లాల పునర్విభజన ప్రక్రియకు సర్కార్ శ్రీకారం చుట్టినప్పటికీ కరోనా కారణంగా జాప్యం జరిగింది.

ఇదీ చదవండి:Shrinking Houses in Tirupati: తిరుపతిలో కుంగుతున్న ఇళ్ల పునాదులు.. వణికిపోతున్న ప్రజలు

ABOUT THE AUTHOR

...view details