నేడు నెల్లూరు, ఒంగోలు, కడప, శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రుల్లో.. సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. కొవిడ్ బాధితుల సౌకర్యార్థం ప్రభుత్వం వీటిని అందుబాటులోకి తెచ్చింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో.. ఈ యంత్రాలు నిర్ధరణ పరీక్షల్లో త్వరగా ఫలితాలు తేల్చేందుకు ఉపయోగపడనున్నాయి.
మరోవైపు.. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా... ఉదయం 11.15 గంటలకు నాడు - నేడుపై సీఎం సమీక్షిస్తారు. సాయంత్రం 4 గంటలకు మైనింగ్ శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తారు.