ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"కార్పొరేషన్ల రుణానికి హామీ ఇచ్చే అధికారం.. ప్రభుత్వానికి రాజ్యాంగమే ఇచ్చింది"

CM Special Secretary: కార్పొరేషన్ల రుణానికి ప్రభుత్వం హామీ ఇచ్చే అధికారం రాజ్యాంగమే ఇచ్చిందని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ అన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారమే రాష్ట్రం అప్పులు చేస్తోందని తెలిపారు. తెదేపా హయాంలోనే అప్పులు 450 శాతం మేర పెరిగాయని వెల్లడించారు.

CM Special Secretary Duvvuri Krishna
సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ

By

Published : Mar 30, 2022, 6:41 PM IST

CM Special Secretary: కార్పొరేషన్ల రుణానికి ప్రభుత్వం హామీ ఇచ్చే అధికారం రాజ్యాంగం ఇచ్చిందని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ అన్నారు. అప్పులు నేరం అన్నట్లుగా మాట్లాడుతున్నారని.. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారమే రాష్ట్రం అప్పులు చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం అప్పులు తీసుకుంటేనే ప్రభుత్వాలు నడిచే పరిస్థితి ఉందని దువ్వూరి పేర్కొన్నారు. రాష్ట్ర అప్పులు ప్రస్తుతం రూ.5.83 లక్షల కోట్లు మాత్రమేనన్నారు. కేంద్రంతో సహా అన్ని రాష్ట్రాలూ రుణాలు తీసుకుంటున్నాయని చెప్పారు. తెదేపా హయాంలోనే అప్పులు 450 శాతం మేర పెరిగాయని చెప్పారు.

CM Special Secretary: 2019 మే నాటికి రూ.63,644 కోట్ల ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఉందన్నారు. 2014 నాటికి విద్యుత్ సంస్థల రుణం రూ.18,374 కోట్లుగా ఉందని వెల్లడించారు. 2019 నాటికి రుణం రూ.55,108 కోట్లకు పెరిగిందన్నారు. అదే సమయంలో కొవిడ్ వల్ల ప్రభుత్వ రెవెన్యూ తగ్గిందన్నారు. క్యాపిటల్ వ్యయం.. దేశంతోపాటు రాష్ట్రంలోనూ తగ్గిందన్న ఆయన.. అన్ని వివరాలూ పారదర్శకంగా ప్రజల ముందు ఉంచుతున్నామని చెప్పారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు.. ఎంత పెరిగాయంటే..?

ABOUT THE AUTHOR

...view details