రైతుల పంటకు స్థానికంగా మార్కెటింగ్ కల్పించడంలో భాగంగానే రాష్ట్రంలో జనతాబజార్లు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. తద్వారా గిట్టుబాటు ధర కల్పించి రైతులకు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. జనతా బజార్లు, ఈ-మార్కెటింగ్ ప్లాట్‌ఫాంపై సమీక్షించిన ముఖ్యమంత్రి.. కనీసం 30 శాతం వ్యవసాయోత్పత్తులకు స్థానిక మార్కెట్ కల్పించేలా ప్రయత్నించాలని సూచించారు. జనతా బజార్లకు, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ-ప్లాట్‌ఫాం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను ఏకకాలంలో ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఖరీఫ్ ముగిసే నాటికే పంటలకు కనీస గిట్టుబాటు ధరలు కల్పించడంపై, రబీలో పంట ప్రణాళికపై చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి ఆర్బీకే పరిధిలో గోదాం: సీఎం జగన్
రైతులు పండించిన ఉత్పత్తులకు స్థానికంగా మార్కెటింగ్ కల్పించే చర్యల్లో భాగంగానే రాష్ట్రంలో జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. రైతులు పండించిన ఉత్పత్తులను స్థానికంగానే మార్కెటింగ్ కల్పించడం ద్వారా గిట్టుబాటు ధర కల్పించి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి రైతుభరోసా కేంద్రం పరిధిలో శీతల గిడ్డంగి, గోదాములు తీసుకురావాలన్నారు.
ప్రతి ఆర్బీకే పరిధిలో కోల్డ్ స్టోరేజీ, గోడౌన్లు తీసుకురావాలని.. గ్రేడింగ్ కూడా ఆర్బీకేల పరిధిలోనే జరిగేలా చేయాలన్నారు. వాటి నిర్వహణ కోసం మండల స్థాయిలో ఒక అధికారిని నియమించుకోవాలని ఆదేశించారు. ఆక్వా సాగు ప్రాంతాల్లో ఉత్పత్తులను నిల్వ చేయడానికి అవసరమైన గోడౌన్ల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి లక్ష్యంగా ఆర్బీకేల పరిధిలో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు, గ్రేడింగ్ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రణాళిక వేసుకోవాలని అధికారులకు తెలిపారు. జనతా బజార్లు, వాటికి అవసరమైన ఫ్రీజర్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: చైనా యాప్స్ నిషేధాన్ని స్వాగతించిన అమెరికా