'ఆంధ్రప్రదేశ్‌లో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటాం' అంటూ.. ఆ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున విజ్ఞాపనలు వస్తున్నాయని తెరాస అధ్యక్షుడు(TRS PRESIDENT KCR), తెలంగాణ సీఎం కేసీఆర్(KCR speech in trs plenary) అన్నారు. దళిత బంధు ప్రకటించాక ఆంధ్రా నుంచి వేల సంఖ్యలో విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని కేసీఆర్ వెల్లడించారు. హైటెక్స్‌లో తెరాస ప్లీనరీ సమావేశాలను ప్రారంభించిన గులాబీ దళపతి(KCR speech in trs plenary).. తెలంగాణ అభివృద్ధి, పార్టీ నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రసంగించారు.
ఏ రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందదని అందరూ విమర్శించారో.. ఆ రంగాల్లోనే అగ్రస్థానంలో ఉన్నామని కేసీఆర్ అన్నారు. యావత్ దేశం రాష్ట్రం వైపు చూస్తోందని చెప్పారు. తెలంగాణలో తమను కలపాలంటూ పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్లు వస్తున్నాయని(KCR speech in trs plenary) కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్, కర్ణాటకలోని రాయచూర్ జిల్లాల ప్రజలు మన రాష్ట్రాల్లో కలవాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు వచ్చి పనిచేస్తున్నారన్న కేసీఆర్.. ఈ ఏడున్నరేళ్లలో తెరాస ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వారి విజ్ఞప్తులకు కారణమని వివరించారు.