ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు సీఎం కేసీఆర్​ పుట్టినరోజు... వేడుకలకు తెలంగాణ సిద్ధం - సీఎం కేసీఆర్​ పుట్టినరోజు వార్తలు

నేడు... తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెరాస అధినేత, సీఎం కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు గులాబీ నేతలతో పాటు అభిమానులు సిద్ధమయ్యారు. హరిత తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తున్న కేసీఆర్​కు... కోటి వృక్షార్చనతో జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు... ఎంపీ సంతోశ్​ చేపట్టిన కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొననున్నారు.

cm kcr birthday celebrations in telangana
నేడు సీఎం కేసీఆర్​ పుట్టినరోజు... వేడుకలకు తెలంగాణ సిద్ధం

By

Published : Feb 17, 2021, 6:08 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెరాస నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. సీఎం పుట్టినరోజు నేపథ్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తెరాస విద్యార్థి, యువజనసంఘం తెలంగాణ భవన్​లో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శిబిరాన్ని ప్రారంభించనున్నారు. సిద్దిపేటలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీ ఫైనల్ జరగనుంది. మంత్రి హరీశ్​ రావు ఆధ్వర్యంలో సిద్దిపేట స్టేడియంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా...

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు మొక్కలు నాటనున్నారు. శాసనసభ ఆవరణలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటనున్నారు.

రెండున్నర కిలోల బంగారు చీర..

హైదరాబాద్​లోని బల్కంపేటలోని ఎల్లమ్మ గుడిలో అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగా రెండున్నర కిలోల బంగారు చీర సమర్పించనున్నారు. మంత్రి తలసాని ఆధ్వర్యంలో హైదరాబాద్ జలవిహార్​లో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కేసీఆర్​పై రూపొందించిన డాక్యుమెంటరీని కేటీఆర్ విడుదల చేయనున్నారు. ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.

ఇదీ చూడండి:

ఈనెల 23న సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్​ భేటీ

ABOUT THE AUTHOR

...view details