సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌కు మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరయ్యారు. కాసేపు ఎమ్మెల్యే బౌలింగ్ వేయగా... మంత్రి హరీశ్ బ్యాటింగ్ చేసి క్రీడాకారులను, యువకులను ఉత్సాహపరిచారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ 67వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా తయారు చేసిన 67 కిలోల కేక్‌ను హరీశ్‌రావు కట్ చేశారు.
టోర్నమెంట్ ఫైనల్లో గెలుపొందిన అక్కన్నపేట మండలం కుందన్వాన్ పల్లి జట్టుకు రూ.లక్షా 20 వేలు, రన్నరప్ కోహెడ జట్టుకు రూ.60వేల చెక్కులను బహుమతిగా అందజేశారు.