ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేను దిగి.. కేటీఆర్​ను ఎందుకు సీఎం చేస్తా..! - అసెంబ్లీ

"చాలా మంది మిత్రులున్నారు నాకు. 20 ఏళ్ల నుంచి చెప్తున్నారు నా ఆరోగ్యం గురించి. కేసీఆర్ ఆరోగ్యం ఖతం అయిందంటగదా. అమెరికా పోతండంటగదా. ఇపుడు నేను సచ్చిపోవట్టి 20 ఏళ్లు అవుతోంది అధ్యక్షా!" - తన ఆరోగ్యంపై అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్

నేను దిగి.. కేటీఆర్​ను ఎందుకు సీఎం చేస్తా..!

By

Published : Sep 16, 2019, 9:58 AM IST

నేను దిగి.. కేటీఆర్​ను ఎందుకు సీఎం చేస్తా..!

తన ఆరోగ్యంపై పలువురు అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి... మరో మూడు దఫాలు రాష్ట్రంలో తెరాస ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తన వయసు ఇప్పుడు 66 ఏళ్లు అని... ఇంకో పదేళ్లు తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. తాను దిగిపోయి కేటీఆర్​ను ఎందుకు సీఎంను చేస్తానని అన్నారు. ప్రజల దీవెన... దేవుడి దయతో బాగుంటానని వెల్లడించారు. తమ తప్పులు ఉంటే చెప్పండి సవరించుకుంటామన్నారు. రాష్ట్ర పరువును బజారున పెట్టొద్దని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details