ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కరోనా లాక్డౌన్ పరిస్థితుల తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్తున్నారు. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలను ఆదుకోవాల్సిందిగా సీఎం... కేంద్ర మంత్రిని కోరనున్నట్టు సమాచారం.
ఇవాళ హస్తినకు సీఎం జగన్.. అమిత్‌షాతో భేటీ - కేంద్ర హోం మంత్రి అమిత్ షా
07:53 June 01
ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానికి సవివరంగా రెండు లేఖలను సీఎం రాశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకునే అంశంతోపాటు ఇతర నిర్ణయాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి అమిత్ షాతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. కౌన్సిల్ రద్దు అంశంతో పాటు ఎస్ఈసీ వ్యవహారం కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చే అవకాశముంది. హోం మంత్రితో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి బేటీ కానున్నట్టు తెలుస్తోంది. దిల్లీ పర్యటన అనంతరం సీఎం బుధవారం రాష్ట్రానికి తిరిగి వస్తారు.
ఇదీ చదవండి: