ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రముఖుల 'మిలాద్‌- ఉన్‌-నబీ' శుభాకాంక్షలు - mahmad pravakata news

ముస్లింలకు సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ 'మిలాద్‌ ఉన్‌ నబీ' శుభాకాంక్షలు తెలిపారు.

cm jagan
cm jagan

By

Published : Oct 30, 2020, 9:53 AM IST


ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'మిలాద్ - ఉన్ - నబీ' శుభాకాంక్షలు తెలిపారు. సర్వమానవాళి శ్రేయస్సు కోసం మహమ్మద్‌ ప్రవక్త కృషిచేశారని సీఎం అన్నారు.

సర్వమానవాళి శ్రేయస్సు కోసం, శాంతిని నెలకొల్పేందుకు కృషిచేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్తని చంద్రబాబు కొనియాడారు. సాటివారి పట్ల ప్రేమ, దయను కలిగి ఉంటూ... శాంతియుత సమాజాన్ని నెలకొల్పినప్పుడే ప్రవక్త సందేశం ఫలప్రదమని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

సమాజాన్ని హింస, ద్వేషాల నుంచి విముక్తి చేసి.. శాంతివైపు నడిపిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కీర్తించారు. ఆయన చూపిన శాంతి, ఐక్యత, మానవతా మార్గాల నుంచి స్ఫూర్తిని పొందుతూ పేదలకు, నిస్సహాయులకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

మరో 6 జిల్లాల్లో: ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో అదనంగా 800 చికిత్సలు

ABOUT THE AUTHOR

...view details