ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా రోగులకు సదుపాయలు, ఔషధాల్లో రాజీ పడొద్దు: సీఎం - ఏపీలో కరోనా కేసులు

కరోనా రోగులకు అత్యుత్తమమైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా బాధితులకు వైద్య పరిస్థితులపై ఆయన సమీక్షించారు. ప్రభుత్వం అండగా ఉందన్న మనోధైర్యం ప్రజల్లో కల్పించాలని దిశానిర్దేశం చేశారు.

cm jagan
cm jagan
author img

By

Published : Jul 6, 2020, 10:13 PM IST

రాష్ట్రంలో కరోనా తీరు, వైద్య పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో నాణ్యమైన సేవలు అందాలని అధికారులను ఆదేశించారు. ఆయా కేంద్రాల్లో సదుపాయాలు సంతృప్తికరంగా ఉండాలని సూచించారు. రోగుల సదుపాయాలు, ఔషధాల్లో రాజీ పడవద్దని స్పష్టం చేశారు.

'రోగులకు అత్యంత మెరుగైన వైద్య సేవలు అందాలి. కొవిడ్ కేసులు ఎక్కువగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరా తీయాలి. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించేలా ప్రచారం చేయాలి. ప్రభుత్వం అండగా ఉందన్న మనోధైర్యం ప్రజల్లో కల్పించాలి '.- వైఎస్ జగన్, ముఖ్యమంత్రి

కరోనాపై ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగిపోయేలా.. వారికి మరింత అవగాహన కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేయడం వంటి వాటిపై విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో కూడా హోర్డింగ్‌లు ప్రదర్శించాలని, వాటిపై ప్రజలకు అవసరమైన అన్ని ఫోన్‌ నెంబర్లు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:

మిడతల దండు వస్తోంది.. భాజపా ఎలా బయటపడుతుందో: విజయసాయి

ABOUT THE AUTHOR

...view details