అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్), సాగు, మార్కెటింగ్, పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య, మత్స్యశాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిసమీక్ష నిర్వహించారు. వీటికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి కావాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల మధ్య అనుసంధానం ఉండాలన్న సీఎం... ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని.. 15 రోజులకోసారి సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారుల స్థాయిలో ప్రతి ఆదివారం సమీక్ష చేయాలని ఆదేశించారు.
Jagan Review: అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి: సీఎం - CM Jagan
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల మధ్య అనుసంధానం ఉండాలని సీఎం జగన్ సూచించారు. అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
CM Jagan Review
ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిష్‌ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. కాకినాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి కార్యాచరణ తయారు చేయాలి. విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈనెల 4 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో అమూల్ పాల సేకరణ చేపట్టాలి. రాష్ట్రంలో మహిళా రైతులకు రూ.3.91 కోట్లు అదనంగా ఆదాయం వచ్చింది.-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఇదీ చదవండీ... 'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్‌పై.. విచారణ వాయిదా