'వైఎస్ఆర్ రైతు భరోసా'పై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలోనూ సామాజిక తనిఖీ చేయాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. పొరపాట్ల కారణంగా ఎవరైనా మిగిలితే వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వచ్చే రైతు భరోసాలో వారికి మళ్లీ లబ్ధి కలిగే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.నవంబరు 15 వరకు రైతులకు సంబంధించి దరఖాస్తు గడువు పూర్తి కానుంది. కౌలు రైతుల విషయంలో డిసెంబరు 15 వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
'రైతుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోండి' - వైఎస్సాఆర్ రైతు భరోసా పథకం వార్తలు
వైఎస్ఆర్ రైతు భరోసాపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. పేర్ల నమోదులో ఎలాంటి పొరపాట్లు ఉన్నా రైతులను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
cm jagan review on raithu barosa scheme