రాష్ట్రంలో ప్రభుత్వం నిర్మిస్తోన్న గృహాలు, ఇళ్లపట్టాలపై ముఖ్యమంత్రి జగన్ పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, ఇతర అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఉగాది నాటికి 26.6 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నాలుగేళ్లలో 30 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. 2024 నాటికి 30 లక్షల ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇళ్లన్నీ ఒకే నమూనాలో ఉండేలా చూడాలని అధికారులకు చెప్పారు. డిజైన్‌లో కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. ఇళ్లు కట్టాక రూ.25 వేల వరకు పావలా వడ్డీకే రుణం ఇచ్చేలా చూడాలన్నారు. రుణంపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని అధికారులకు స్పష్టం చేశారు. పేదల కాలనీల్లో చెట్లు నాటి.. డ్రైనేజీపై ప్రణాళిక అమలు చేయాలని.. విద్యుత్, తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు.
'నాలుగేళ్లలో 30 లక్షలకుపైగా ఇళ్లు నిర్మించాలి' - గృహ నిర్మాణాలు, ఇళ్లపట్టాలపై సీఎం జగన్ సమీక్ష
రాష్ట్రంలో ప్రభుత్వం నిర్మిస్తున్న గృహాలు, ఇళ్లపట్టాలపై ముఖ్యమంత్రి జగన్ పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఉగాది నాటికి 26.6 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని.. నాలుగేళ్లలో 30 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి జగన్
TAGGED:
cm jagan review on houses