ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మిషన్‌ ఫర్‌ క్లీన్‌ కృష్ణా అండ్‌ గోదావరి కెనాల్స్‌... త్వరలో..!

కృష్ణా, గోదావరి నదుల కాలువల శుద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాలుష్య నివారణ, సుందరీకరణ చేపట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పలు విభాగాలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. గట్లపై నివసించే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి... వారు ఇళ్లు కట్టుకున్న అనంతరమే ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా కాలువల శుద్ధి పనులను పూర్తి చేయాలని సీఎం సూచించారు.

cm jagan review on clean krishna and godavari canals
ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సమీక్ష

By

Published : Feb 19, 2020, 11:59 PM IST

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమీక్ష

కృష్ణా, గోదావరి నదుల కాలువల శుద్ధిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. మిషన్‌ ఫర్‌ క్లీన్‌ కృష్ణా అండ్‌ గోదావరి కెనాల్స్‌ పేరిట పనులు చేపట్టనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు మిషన్‌ డైరెక్టర్‌ కాటమనేని భాస్కర్, ఆర్థిక, జలవనరుల శాఖ, మున్సిపల్‌ శాఖ, కాలుష్య నియంత్రణ బోర్డు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిషన్‌ వెబ్‌సైట్‌ ప్రారంభించిన సీఎం జగన్... అధికారులతో మాట్లాడారు. ప్రాజెక్టు ఉద్దేశం సహా... చేపట్టాల్సిన విధానంపై మార్గనిర్దేశం చేశారు.

కాలువలను కాలుష్య రహితంగా తీర్చిదిద్ది ఆధునీకీకరించడమే ప్రధాన ఉద్దేశమని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాలువలను శుద్ధి చేసి సాగుకు, తాగుకు స్చచ్ఛమైన నీటిని అందించాలని సీఎం ఆదేశించారు. గోదావరి డెల్టా పరిధిలో 10వేల కిలోమీటర్ల కాలువలు, కృష్ణా డెల్టా పరిధిలో 9,800 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ముందుగా 36 మేజర్‌ కెనాల్స్‌లో 1344 కిలోమీటర్లు పనులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాలువ గట్లపై ప్రజలకు ఉపయోగపడే వాకింగ్‌ ట్రాక్‌లు, పార్క్‌లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

విజయవాడ, విశాఖలో ముందుగా పనులు చేయాలని సూచించిన ముఖ్యమంత్రి జగన్... కృష్ణా జిల్లాలో రైవస్‌ కెనాల్, గుంటూరు జిల్లాలో కృష్ణా వెస్ట్రన్‌ కెనాల్, పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు కెనాల్, తూర్పుగోదావరి జిల్లాలో జీఈ మెయిన్‌ కెనాల్, పులివెందుల, విశాఖపట్నంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా చేయాలన్నారు. 18 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల పరిధిలో కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. తాడేపల్లి మున్సిపాలిటీలో ముందుగా ప్రారంభించాలని సూచించారు. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి ఇరిగేషన్, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, పంచాయతీరాజ్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, ఎన్‌జీవోలను భాగస్వాములు చేస్తూ కార్యక్రమం చేపట్టాలని సూచించారు.

కాలువల శుద్ధి, సుందరీకరణ కోసం... కాలువ కట్టలపై ఉంటున్న వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని స్పష్టం చేశారు. వారు ఇళ్లు కట్టుకున్న తరువాతే అక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు. వారిని ఎక్కడా ఇబ్బంది పెట్టకూడదని స్పష్టం చేశారు. ఒక్కసారి పూర్తిచేసిన తర్వాత మళ్లీ ఎవరూ ఆక్రమించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాడు-నేడు కార్యక్రమం తరహాలో పనులు చేయాలన్న సీఎం... ప్రజలకు తెలిసేలా ఫొటోలు తీసి ఇప్పుడున్న పరిస్థితి, భవిష్యత్‌లో ఏలా తీర్చిదిద్దేది చూపాలన్నారు. మిషన్‌కు అవసరమైన సహాయ సహకారాలను సీఎంవో అధికారి నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పారు. సాలిడ్‌ వేస్ట్‌ కలెక్షన్, డిస్పోజల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి:

విలువలు.. విశ్వసనీయతే మా బలం: బృహతి చెరుకూరి

ABOUT THE AUTHOR

...view details