కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. కొవిడ్ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం సమర్థ చర్యలు తీసుకుందని వివరించారు. మరో 2 నెలలు ఉచిత బియ్యం పంపిణీ పొడిగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Jagan Delhi Tour: 'పౌరసరఫరాల శాఖకు రూ.2,339 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి' - CM Jagan Delhi Tour
పౌరసరఫరాల శాఖకు రూ.2,339 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని సీఎం జగన్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు. మరో 2 నెలలు ఉచిత బియ్యం పంపిణీ పొడిగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం సమర్థ చర్యలు తీసుకుందని వివరించారు.
2011 జనాభా లెక్కల ప్రకారం బియ్యం ఇచ్చేలా సూత్రాన్ని అమలు చేస్తున్నారు. కేవలం 0.91 కోట్ల రేషన్ కార్డులకే బియ్యం పంపిణీని పరిమితం చేశారు. కేటాయింపులు 1,85,640 మెట్రిక్ టన్నుల నుంచి 1,54,148కి తగ్గించారు. కేటాయింపులు తగ్గడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. పౌరసరఫరాల శాఖకు రూ.2,339 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోంది. రైతులకు చెల్లింపుల కోసం బకాయిల విడుదల అత్యంత అవసరం-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఇదీ చదవండీ... CM Jagan Delhi Tour: ముగిసిన సీఎం దిల్లీ పర్యటన.. రాష్ట్రానికి తిరుగు పయనం