ఈ-ప్రొక్యూర్‌మెంట్ కాంట్రాక్టులపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. మరింత పటిష్టంగా రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. కనీసం ఐదుగురు లేదా బిడ్డింగ్‌లో పాల్గొన్న మొదటి 60 శాతం మందికే అవకాశముంటుందని స్పష్టం చేశారు. బిడ్డింగ్‌లో 10 మంది పాల్గొంటే ఎల్-1 నుంచి ఎల్-6 వరకు అర్హులయ్యేలా చూడాలని ఆదేశించారు. రివర్స్ టెండరింగ్‌ను మరింత బలోపేతం చేయాలని... పారదర్శకత, వీలైనంత ప్రజాధనం ఆదాయే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలన్నారు.
'10 లక్షల నుంచి 100 కోట్ల టెండర్లకు రివర్స్ టెండరింగ్' - cm jagan meet on e-procurment contracts
ఈ-ప్రొక్యూర్‌మెంట్ కాంట్రాక్టులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్టుల్లో పారదర్శకతే లక్ష్యంగా మరిన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
శాశ్వత పారదర్శకత కోసం పాలసీ...
రూ.10లక్షల నుంచి రూ.100 కోట్ల టెండర్లకూ రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని సీఎం పేర్కొన్నారు. జనవరి 1 నుంచి సరికొత్త విధానం అమలు చేయాలని... ఈలోగా విధాన రూపకల్పన, పారదర్శకత శాశ్వతంగా ఉండేలా పాలసీ తీసుకురానున్నట్లు తెలిపారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ సంబంధిత కార్యకలాపాల సమన్వయం కోసం ఐఏఎస్ అధికారిని నియమించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. వంద కోట్లకు పైగా విలువ ఉన్న కాంట్రాక్టులను ముందస్తు న్యాయసమీక్ష ప్రక్రియకు నివేదించటం ద్వారా విప్లవాత్మక సంస్కరణలు తీసుకు వచ్చామని సీఎం జగన్ తెలిపారు.
TAGGED:
e-procurment