ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతుల ఆర్థిక భద్రతే ప్రభుత్వ లక్ష్యం: సీఎం వైఎస్​ జగన్​ - cm jagan launched second phase ysr rythu bharosa

వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందించి వారిని ఆదుకోవటమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. వైఎస్​ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్​ పథకం కింద రెండో విడత చెల్లింపులను ఆయన ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆన్​లైన్​ వేదికగా రైతుల ఖాతాల్లో 2వేల రూపాయలను జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 50.47 లక్షల రైతుల ఖాతాల్లో 1115 కోట్ల రూపాయల మేర జమ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ysr rythu bharosa pm kisan financial assistance scheme
ysr rythu bharosa pm kisan financial assistance scheme

By

Published : Oct 27, 2020, 7:04 PM IST

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రైతులకు రైతు భరోసా - పీఎం కిసాన్ ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రైతులకు పూర్తి స్థాయి ఆర్థిక భద్రత కల్పించటమే లక్ష్యంగా వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్నట్టు వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రెండో విడత చెల్లింపుల కింద రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పున సీఎం జమ చేశారు.

50.47 లక్షల రైతుల ఖాతాల్లోకి జమ...

రాష్టవ్యాప్తంగా మొత్తం 50.47 లక్షల రైతులు, కౌలు రైతుల ఖాతాల్లో దాదాపు రూ.1,115 కోట్లు జమ చేసినట్టు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఏటా పెట్టుబడి సాయంగా ప్రతి రైతు కుటుంబానికి 13,500 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని... అదే విషయాన్ని ప్రభుత్వం విశ్వసిస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. ఆ దిశలోనే రైతులను ఆన్ని రకాలుగా ఆదుకునేందుకు అడుగులు వేస్తున్నట్టు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా పంటలు నష్ట పోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని చెల్లించారు. మొత్తం 135 కోట్ల రూపాయల మేర ఇన్​పుట్​ సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేశారు. పంటలు నష్ట పోయిన రైతులకు అదే సీజన్ లో ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వటం చరిత్రలో ఇదే తొలిసారి అని సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అక్టోబరు నెలలో వచ్చిన వర్షాలకు పంట నష్టంపై అంచనాలు వేస్తున్నామని... ఈ నష్టాలకు ఈ ఏడాది నవంబరు నెలలో పరిహారం చెల్లిస్తామని చెప్పారు.

గిరిజన రైతులకు కూడా....

కౌలు రైతులతో పాటు గిరిజన ప్రాంతాల్లో సాగు పట్టాలు(ఆర్ఓఎఫ్ఆర్) పొంది సాగుకు సిద్ధమైన గిరిజన రైతులకు ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నట్టు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి నెలలో సంక్రాంతి సందర్భంగా మరో 2 వేల రూపాయలను చెల్లించనున్నట్టు సీఎం వెల్లడించారు. మరోవైపు జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పుడు ఇస్తుండగా, అక్టోబరు నష్టానికి సంబంధించి నవంబరు నెలలో ఇన్​పుట్ సబ్సిడీ అందించనున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10,641 రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులనూ సేకరించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరాతోపాటు, వారికి సూచనలు, సలహాలు, పంట విక్రయంలోనూ సహకారం అందిస్తామన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రతి ఆర్బీకే పరిధిలో వరి కోత యంత్రాలు అందుబాటులో ఉంచుతామని స్ఫష్టం చేశారు.

అగ్రి ల్యాబ్​లు ఏర్పాటు...

రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 147 నియోజకవర్గాల్లో అగ్రి ల్యాబ్​లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నాణ్యత పరీక్షించాకే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరఫరా జరుగుతుందన్నారు. మరోవైపు 2019-20లో 15 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు సీఎం జగన్ తెలిపారు. ఇన్ని చేస్తున్నా... కొందరు వ్యక్తులు డ్రామాలు చేస్తున్నారని.. 16వ తేదీనే వర్షాలు ముగిసినా 10 రోజుల తర్వాత ట్రాక్టర్ కు పువ్వులు కట్టి మరీ పర్యటిస్తున్నారని పరోక్షంగా తెదేపా విమర్శనాస్త్రాలు సంధించారు. అనంతరం వీడియోకాన్ఫెర్స్​లో పలువురు రైతులతో సీఎం ముచ్చటించారు.

ఇదీ చదవండి:

రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ

ABOUT THE AUTHOR

...view details