ఈ నెల 11వ తేదీన నెల్లూరులో సీఎం జగన్ అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. లబ్ధిదారుల సంఖ్య ఎంత అన్నది ఇంకా నిర్ధరించాల్సి ఉందని మంత్రి స్పష్టం చేశారు. లబ్ధిదారులకు సంబంధించి రీ వెరిఫికేషన్ నిర్వహించామని.. 80 శాతం మేర ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన మహిళల ఖాతాలకు అమ్మ ఒడి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు.
జనవరి 11న అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం - అమ్మఒడి అప్డేట్స్
ఈ నెల 11వ తేదీన నెల్లూరులో సీఎం జగన్ అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారుల సంఖ్య ఎంత అన్నది ఇంకా నిర్ధరించాల్సి ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మండలాల్లో తల్లితండ్రుల కమిటీలను అహ్వానిస్తామన్నారు. పాఠశాలలో నమోదై ఉంటేనే అమ్మ ఒడి వర్తిస్తుందని తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో అర్హులందరికీ వర్తింప చేస్తామని మంత్రి వెల్లడించారు. గతేడాది 42 లక్షల మంది అమ్మఒడి లబ్ధిదారులు ఉన్నట్లు మంత్రి సురేష్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కృష్ణా తీరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన