ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Floods in AP: ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానక్కర్లేదు - సీఎం జగన్

వరద ప్రాంతాల ఎమ్మెల్యేలు.. సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు(cm jagan on floods news). అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా.. రానక్కర్లేదన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.

CM jagan
CM jagan

By

Published : Nov 21, 2021, 4:49 PM IST

వరద ప్రాంతాల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానక్కర్లేదన్నారు ముఖ్యమంత్రి జగన్(CM jagan Directs MLAs to Provide Relief to Flood-affected people news). వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు(floods in Andhra Pradesh news). ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని కోరారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సాయం అందేలా చూడాలని ఆదేశించారు.

పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీల పూడికతీత పనులు చేపట్టాలన్న ముఖ్యమంత్రి.. రేషన్‌ సరకుల పంపిణీ, నష్టంపై పక్కాగా అంచనా వేయడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. పంట దెబ్బతిన్న రైతులు తిరిగి సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అండగా ఉండాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details