అంబేడ్కర్ జయంతి సందర్భంగా... సీఎం జగన్ బాబాసాహెబ్ సేవలను స్మరించుకున్నారు. భారత సమాజానికి దార్శనికులు బాబాసాహెబ్ అంబేడ్కర్ అని ట్విట్టర్‌లో సీఎం జగన్ పేర్కొన్నారు. దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక విధానాల నిర్ణేత అంబేడ్కర్ అని కొనియాడారు.
'సామాజిక, రాజకీయ, ఆర్థిక విధానాల నిర్ణేత అంబేడ్కర్'
బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా... ముఖ్యమంత్రి జగన్, తెదేపా అధినేత చంద్రబాబు ఆయన సేవలను కొనియాడారు. అంబేడ్కర్ సేవలను స్మరించుకున్నారు.
తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ నాయకత్వంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం... అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చి గౌరవించిందని చంద్రబాబు గుర్తుచేశారు. అంబేడ్కర్ ఆశయాల మేరకు తెదేపా దళితులకు విద్య, ఉపాధి, ప్రభుత్వ పదవులు కట్టబెట్టడం, రాజకీయ రంగాల్లో పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయడానికి ప్రజారాజధాని అమరావతిలో అంబేడ్కర్ స్మృతివనం పేరిట 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు 25 ఎకరాలను కేటాయించామని చంద్రబాబు వివరించారు.
ఇదీ చదవండీ... 20 వేల జనతా బజార్లు ఏర్పాటు చేయాలి: సీఎం జగన్