ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bhatti Comments: 'శాసనసభలో ప్రజల పక్షాన పోరాడినందుకే.. ప్రభుత్వంలో కదలిక..' - peoples padhayatra

Bhatti Comments: బడ్జెట్​ సమావేశాల దృష్ట్యా.. వాయిదా పడిన తెలంగాణ కాంగ్రెస్​ నేత భట్టి విక్రమార్క పీపుల్స్​ పాదయాత్రను మళ్లీ ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. నల్లగొండ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. పాదయాత్రను మొదలుపెట్టారు.

bhatti vikramarka
భట్టి విక్రమార్క

By

Published : Mar 25, 2022, 3:13 PM IST

మాట్లాడుతున్న భట్టి విక్రమార్క
Bhatti Comments: తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం అమ్మపేటలోని నల్లగొండ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర మొదలుపెట్టారు. ఆలయ ప్రాంగణం నుంచే కోలాటాలు, డప్పు వాద్యాలతో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతాలు పలికారు. భట్టి పాదయాత్రకు మద్దతు తెలియజేసిన తెదేపా నాయకులు పాదయాత్రను ప్రారంభించారు. 7 రోజుల్లో 102 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన భట్టి.. బడ్జెట్ సమావేశాల అనంతరం తిరిగి మొదలుపెట్టారు. ఈ పాదయాత్రలో జిల్లా నాయకులు రాయల్ నాగేశ్వరరావు, మంద వెంకటేశ్వర్లు, సామినేని రమేష్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

తమ వంతు కృషి:ప్రజల తరఫున శాసనసభలో గొంతెత్తినందుకే.. ప్రభుత్వం కదిలిందని భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో చేసిన పాదయాత్రలో తన ముందుకొచ్చిన సమస్యలను సభ ముందుంచి పరిష్కారమయ్యేలా తమ వంతు కృషి చేసినట్టు వివరించారు.

"గత 7 రోజుల పాటు చేసిన పాదయాత్రలో.. ప్రజలు మా ముందుకు తీసుకువచ్చిన సమస్యలను శాసనసభలో మాట్లాడి వాటి పరిష్కారం కోసం కృషి చేశాం. నిరుద్యోగ సమస్యపై సభలో యువత తరఫున గళం వినిపించినందుకే.. ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల ప్రకటన చేసింది. డబుల్ బెడ్ రూం ఇళ్లకు నిధులు కేటాయింపు.. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం లాంటి ప్రజా సమస్యలపై శాసనసభలో గొంతెత్తాం. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్​, డీజిల్ ధరల పెంపుతో ప్రజలు విసిగిపోతున్నారు" - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ఇదీ చూడండి:Central on Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం మరో మెలిక..

ABOUT THE AUTHOR

...view details