ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రామతీర్థం ఘటన నిందితులను మూడురోజుల్లో పట్టుకుంటాం: వెల్లంపల్లి

vellampalli
vellampalli

By

Published : Jan 4, 2021, 7:20 PM IST

Updated : Jan 4, 2021, 8:06 PM IST

19:17 January 04

రామతీర్థం, రాజమహేంద్రవరం ఘటనలపై సీఐడీ విచారణ

రామతీర్థం ఆలయ నమూనా

రామతీర్థం, రాజమహేంద్రవరం విఘ్నేశ్వరాలయం ఘటనలపై  సీఐడీ విచారణకు ఆదేశించామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.  రామతీర్థం ఘటన నిందితులను మూడు రోజుల్లో పట్టుకుంటామని స్పష్టం చేశారు. రామతీర్థంను పూర్తిగా ఆధునికీకరణ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆగమశాస్త్రం ఆధారంగా విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం చేపడతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రామతీర్థం ఆలయ నమూనాను మంత్రి మీడియాకు విడుదల చేశారు.

ఆధారాలు దొరికాయి...

రామతీర్థం ఘటన సున్నితమైందన్న మంత్రి.. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. నిందితులను అరెస్టు చేసేందుకు ఆధారాలు దొరికాయని చెప్పారు.  మంగళవారం తలపెట్టిన ర్యాలీని విరమించుకోవాలని భాజపాను కోరారు. చిన్న గుడుల్లోని తాత్కాలిక విగ్రహాలు ధ్వంసమైతే ప్రభుత్వానికి ఆపాదించటం సరికాదని అభిప్రాయపడ్డారు. 

'ఆలయాలపై దాడులకు సంబంధించి 88 కేసులు నమోదయ్యాయి. ఆయా దాడుల ఘటనల్లో 169 మందిని అరెస్టు చేశాం. రాష్ట్రంలో 57,584 ఆలయాలు ఉన్నాయని పోలీసుశాఖ మ్యాపింగ్ చేసింది. ప్రస్తుతం 3 వేల ఆలయాల్లోనే సీసీ కెమెరాలు అమర్చారు. సీసీ కెమెరాలపై దేవాదాయశాఖ కార్యాచరణ ప్రణాళిక ఇచ్చింది. నిబంధనలను ప్రైవేట్‌ ఆలయాలూ అనుసరించేలా ప్రణాళిక చేపట్టాం' - వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి

ఇదీ చదవండి

ఆలయాలపై దాడుల నివారణకు ప్రత్యేక వ్వవస్థ..?

Last Updated : Jan 4, 2021, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details