సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా.. ప్రముఖ నృత్య దర్శకుడు కూల్ జయంత్(44) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. 'ప్రేమదేశం'లో కూల్ జయంత్‌ను కొరియోగ్రాఫర్‌గా పరిచయం చేసిన నిర్మాత కె.టి.కునుజోమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
choreographer died: ప్రముఖ కొరియోగ్రాఫర్ మృతి.. సినీ పరిశ్రమలో విషాదం - నృత్య దర్శకుడు కూల్ జయంత్ మృతి
సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా.. ప్రముఖ నృత్య దర్శకుడు కూల్ జయంత్(44) తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ మృతి
డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన కూల్ జయంత్.. ప్రభుదేవా, రాజు సుందరం మాస్టర్ల డ్యాన్స్ ట్రూపులలో పని చేశాడు. సుమారు 800 చిత్రాల్లో డ్యాన్సర్‌గా చేశారు. 'కాదల్ దేశం' చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్‌గా మారారు. తమిళం, మలయాళం భాషల్లో సుమారు 100కు పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు. ఆయన మృతిపై పలువురు తమిళ, మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి