ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రెండు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలి'

అంపన్ తుపాన్ బీభత్సం నుంచి ఒడిశా, పశ్చిమ్​ బంగ రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. హుద్​హుద్​లో ఇదే విధంగా విశాఖ ఎంతో నష్టపోయినా... ప్రజలు మెుక్కవోని ధైర్యంతో దాన్ని అధిగమించారని గుర్తు చేశారు.

chandrababu on amphan cyclone
'రెండు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలి'

By

Published : May 22, 2020, 4:00 PM IST

అంపన్ బీభత్సంతో ఒడిశా, పశ్చిమ్​ బంగ రాష్ట్రాలు అస్తవ్యస్తం అయ్యాయని.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక జిల్లాల్లో అంపన్ సృష్టించిన విధ్వంసం కలిచివేసిందన్నారు. కొందరు మృతిచెందగా, మరికొందరు నిరాశ్రయులు అయ్యారని విచారం వ్యక్తం చేశారు.

ఈదురుగాలులు వందల కిలోమీటర్ల వేగంతో బీభత్సం సృష్టించాయన్న ఆయన.. వేలాది విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయన్నారు. కుంభవృష్టితో జనజీవనం అస్తవ్యస్తం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హుద్​హుద్ తుపాన్​ సమయంలో 250 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విశాఖలో సృష్టించిన బీభత్సం తెలిసిందేనని పేర్కొన్నారు.

విశాఖ ప్రజానీకం మొక్కవోని ధైర్యంతో హుద్​హుద్ నష్టాన్ని అధిగమించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడీ అంపన్ బీభత్సం నుంచి రెండు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బాధితులకు సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల జీవన పరిస్థితులు వీలైనంత తొందరలో చక్కబడాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:అంపన్​ పంజా: బంగాల్​లో 80కి చేరిన మృతులు

ABOUT THE AUTHOR

...view details