CM Jagan Angry: రవాణాశాఖలో జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బదిలీ అయిన కమిషనర్ రాజాబాబు తీసుకున్న నిర్ణయాలపై.. సీఎం అసహనం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాజాబాబు జారీ చేసిన వివాదాస్పద.. ఆన్ డిప్యుటేషన్ జీవో 23ను తక్షణం రద్దు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి చర్యలనూ సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత రెండు నెలల్లో రాజాబాబు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను సమీక్షించాలని అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహం.. ఎందుకంటే..! - సీఎం జగన్
CM Jagan Angry: ముఖ్య మంత్రి జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణాశాఖలో ఇటీవల బదిలీ అయిన కమిషనర్ తీసుకున్న నిర్ణయాలపై సమగ్ర విచారణ జరిపి.. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
cm jagan
సీఎం ఆదేశాలతో కొత్త కమిషనర్ ఆంజనేయులు.. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు అదనపు కమిషనర్ ఎస్ఎవి ప్రసాదరావు, సంయుక్త కమిషనర్లు రమాశ్రీ, వెంకటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఓడీలు రద్దు కావటంతో 23 మంది అధికారులు పాత స్థానాల్లోనే కొనసాగనున్నారు.
ఇవీ చదవండి: