తెలంగాణలోని నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని అటవీ ప్రాంతంలో కొన్ని నెలలుగా చిరుత సంచరిస్తుంది. తాజాగా రెండు రోజుల క్రితం బాలాజీ గుట్ట సమీపంలో రహదారిపై... స్థానికులకు చిరుత పులి కనిపించడంతో చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు మళ్లీ భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు... ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
గ్రామస్థుల నుంచి వివరాలు తీసుకుని చిరుతకు హాని కలిగించే ఏ పని చేయవద్దని సూచించారు. చిరుత నుంచి తమకి ఏ హాని కలుగకుండా... అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవట్లేదని బాధితులు ఆరోపించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.