ప్రజా రాజధాని అమరావతిని.. సంపద సృష్టి, ఉపాధి కల్పన ద్వారా పేదరిక నిర్మూలనకు దోహదపడేలా నిర్మించేందుకు తెదేపా శ్రీకారం చుట్టిందని తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. రాజధాని అమరావతి అద్భుతంగా ఉండాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష అని చంద్రబాబు స్పష్టం చేశారు. మన బిడ్డలు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి ఉండకూడదనే కాలికి బలపం కట్టుకుని సంస్థల చుట్టూ తిరిగి పెట్టబడులు రాబట్టామని గుర్తు చేశారు. భూములిచ్చిన రైతుల త్యాగాలు వృథా కారాదన్న ఆయన... భావి తరాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనేదే తెలుగుదేశం పార్టీ తపన అని చంద్రబాబు స్పష్టం చేశారు.
'భావి తరాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనేదే తెదేపా తపన' - babu comments on amaravathi
ఉపాధి కల్పనలో మేటిగా ఉండి పేదరిక నిర్మూలనకు దోహద పడేలా.. రాజధాని నిర్మాణానికి తెదేపా శ్రీకారం చుట్టిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. భవిష్యత్ తరాలు ఉజ్వలంగా ఉండాలనేదే తెదేపా తపన అని స్పష్టం చేశారు.
'భావి తరాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనేదే తెదేపా తపన'