ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గవర్నర్​కు చంద్రబాబు ఫోన్

chandrababu phone call to governor
chandrababu phone call to governor

By

Published : Oct 19, 2021, 5:45 PM IST

Updated : Oct 19, 2021, 7:33 PM IST

17:39 October 19

తెదేపా కార్యాలయాలపై దాడుల విషయాన్ని వివరించిన చంద్రబాబు

పార్టీ కార్యాలయం వద్ద చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై దాడులకు సంబంధించి తెదేపా అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దాడుల విషయాన్ని గవర్నర్‌కు వివరించారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. వైకాపా దాడుల గురించి వివరించారు. అధికార పార్టీ  దాడుల దృష్ట్యా కేంద్ర బలగాల సాయాన్ని కోరారు. 

పార్టీ కార్యాలయానికి చంద్రబాబు

దాడి విషయం తెలుసుకున్న చంద్రబాబు వెంటనే మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి పార్టీ శ్రేణులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వైకాపా శ్రేణుల దాడిలో దెబ్బతిన్న కార్యాలయ సామగ్రి, ధ్వంసమైన నేతల వాహనాలను పరిశీలించారు. చంద్రబాబు వెంట పార్టీ నేతలు..దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, అశోక్‌బాబు, పట్టాభి తదితరులు పార్టీ కార్యాలయానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.

అరగంట ముందే చంద్రబాబు ఫోన్

తెదేపా కార్యాలయంపై దాడికి అరగంట ముందే డీజీపీకి చంద్రబాబు ఫోన్ చేశారు. పార్టీ ఆఫీసు దగ్గర జనం గుమికూడారని చంద్రబాబుకు నేతల సమాచారం అందించారు. ఇదే విషయాన్ని డీజీపీకి చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ తాను వేరే పనిలో ఉన్నానని డీజీపీ సవాంగ్ చెప్పినట్లు తెలుస్తోంది. డీజీపీ సరిగా స్పందించకపోవటంతోనే..కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేశారని  పార్టీ వర్గాలు తెలిపాయి.

డీజీపీ ఆఫీస్‌కు ఫోన్‌ చేసినా స్పందన లేదు: అశోక్‌బాబు

మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనను ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఖండించారు. లేళ్ల అప్పిరెడ్డి సారథ్యంలో జనాన్ని పోగు చేసి తెదేపా కార్యాలయంపై దాడికి పంపారని ఆరోపించారు. వందలాది మంది ఒక్కసారిగా  పార్టీ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు, కార్లు ధ్వంసం చేశారని వివరించారు. తెదేపా కార్యాలయం పక్కనే డీజీపీ ఆఫీసు ఉంది... డీజీపీ కార్యాలయానికి ఫోన్  చేసిన స్పందనలేదని అశోక్‌బాబు అన్నారు.  

అసలు ఏం జరిగిందంటే..

ముఖ్యమంత్రి జగన్‌ను తెదేపా నేతలు విమర్శించడాన్ని నిరసిస్తూ వైకాపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా కార్యాలయాలు, నేతల నివాసాలపై దాడులకు తెగబడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈదాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసమయ్యాయి. కార్యాలయం వద్ద నిలిపిఉంచిన వాహనాలపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీంతో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో తెదేపా కార్యాలయంలో ఉన్న కెమెరా మెన్‌ బద్రీకి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఆపార్టీ శ్రేణులు జాతీయరహదారిపై ధర్నాకు దిగారు. ఫలితంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

ఇదీ చదవండి

మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా శ్రేణుల దాడి

Last Updated : Oct 19, 2021, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details