ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎవర్ని మోసం చేయడానికి ఈ కమిటీలు' - బీసీజీ నివేదికపై చంద్రబాబు స్పందన వార్తలు

ప్రజల్ని మోసం చేసేందుకే వైకాపా ప్రభుత్వం కమిటీలను వేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలు చెత్త కాగితాలన్నారు. అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు.

chandrababu on bcg report
బీసీజీ నివేదికపై చంద్రబాబు స్పందన

By

Published : Jan 4, 2020, 3:01 PM IST

రాజధానిపై బీసీజీ ఇచ్చిన నివేదిక అసత్యాల పుట్ట అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బీసీజీ నివేదిక ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీజీకి విశ్వసనీయత లేదని.. ఆ నివేదిక చెత్త కాగితమన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టంగా రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పిందని.. దాని ఆధారంగా తీసుకున్న నిర్ణయం మార్చడానికి వారెవరని మండిపడ్డారు. సీఎం జగన్ సహా ఇతర వైకాపా నేతల స్పందనల వీడియోలు ప్రదర్శించారు. అజేయ కల్లం చెబితే జీఎన్ రావు.. విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి చెప్పినదానికి అనుగుణంగా బీసీజీ.. నివేదికలు ఇచ్చాయన్నారు. ఎవర్ని మోసం చేయటానికి మరో హైపవర్ కమిటీ వేశారని ధ్వజమెత్తారు.

బీసీజీ నివేదికపై చంద్రబాబు స్పందన

జిల్లాల వారీగా అభివృద్ధి చేశాం

తాము ఒక ప్రణాళిక ప్రకారం జిల్లాల వారీగా అభివృద్ధి చేశామని చంద్రబాబు అన్నారు. హుద్​హుద్‌కి ముందు, తర్వాత విశాఖ అభివృద్ధి అంతా ప్రజలు గమనించాలన్నారు. విమానాశ్రయానికి భూముల సేకరణలో వైకాపానే కేసులు వేయించి అడ్డుకున్నారని ఆరోపించారు. తాము డాటా సెంటర్ తెస్తే.. వైకాపా ప్రభుత్వం దాన్ని పోగొట్టిందని మండిపడ్డారు. కర్నూలుకు ఎయిర్‌పోర్టు తెస్తే కనీసం విమానాలు తేలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నంద్యాలలో తాము మెగా సీడ్ హబ్ తెస్తే దాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఏ జిల్లాలో ఏం చేయాలో స్పష్టంగా చెప్పి దానికోసం కృషి చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు.

బీసీజీ నివేదికపై చంద్రబాబు స్పందన

ఇవీ చదవండి:

'అర్ధరాత్రి రైతుల ఇళ్లల్లో సోదాలా..?

ABOUT THE AUTHOR

...view details