ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 3, 2021, 7:54 PM IST

Updated : Nov 3, 2021, 9:22 PM IST

ETV Bharat / city

తెలుగు ప్రజలకు.. చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నారా లోకేశ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు.

తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు


చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ.. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులతో అంతా సుఖ సంతోషాలతో జీవించాలని అభిలషించారు. సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడూ వెల్లివిరియాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలన ముగింపునకు ఈ దీపావళి నాంది కావాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పండుగను ఆనందంగా జరుపుకోవాల్సిన అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టాల్సి రావటం బాధాకరమన్నారు. ప్రతీ కుటుంబం సుఖసంతోషాలతో దీపావళి జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పరిస్థితి నరకాసుర పాలన మాదిరిగానే ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.

"దీపం వెలిగించుకుందామంటే నూనె ధర మండుతోంది. లైట్లు వేసుకుందామంటే కరెంటు చార్జీలు షాక్ కొట్టేస్తున్నాయి. మున్ముందు మంచి రోజులు రావాలని ఆశిద్దాం. ఇంటిల్లిపాదికీ ఆనందాలు పంచే దీపాల పండుగ వేళ, సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ, ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు." అని ట్వీట్ చేశారు.

తెలుగు ప్రజలకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్వెల పండగ ప్రజలందరిలో సంతోషం నింపాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి కుటుంబం ఆనందంతో జరుపుకోవాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి:రెండు రోజులపాటు ట్రేడ్ యూనియన్ల సమ్మె

Last Updated : Nov 3, 2021, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details