ప్రతి శుభకార్యానికి ముందు జ్యోతిని వెలిగించే భారతీయ సంప్రదాయంలో... దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అలాంటి దీపాలను ఇంటింటా వెలిగించి శుభాలు ఆహ్వానించే ఈ పండుగను... ప్రజలందరూ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
'తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు' - రాష్ట్ర ప్రజలకు లోకేశ్ దీపావళి శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వెలుగుల పండుగనాడు ప్రతిఒక్కరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు
దీపం జ్ఞానానికి, ఆనందానికి, ప్రగతికి చిహ్నమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు ప్రతి ఇంటా నిండిన వెలుగులు ఇంటిల్లిపాదికీ జీవితమంతా నిత్య సంతోషాలను పంచుతూ... శాశ్వతంగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి...గన్నవరం రాజకీయం... గరంగరం