ఐటీడీపీ పేరిట సరికొత్త డిజిటల్ వేదికను తెలుగుదేశం అధినేత చంద్రబాబు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజలు, కార్యకర్తలకు పార్టీలో విస్తృత భాగస్వామ్యం కల్పించి నెట్ వర్కింగ్ అనుసంధానంలో భాగస్వామ్యుల్ని చేసేందుకు విజయదశమి సందర్భంగా దీనిని ప్రారంభించారు. స్వచ్ఛందంగా ఎవరైనా తమ స్వరం వినిపించుకునే అవకాశం దీని ద్వారా కల్పించారు. రాజకీయ, పరిపాలన, సామాజిక అంశాల్లో ప్రజలను ప్రభావితం చేసేలా ఈ వేదిక పనిచేస్తుందని చంద్రబాబు ప్రకటించారు.
తెదేపా సరికొత్త డిజిటల్ వేదిక...ఐటీడీపీ - తెలుగుదేశం అధినేత చంద్రబాబు వార్తలు
విజయదశమిని పురస్కరించుకుని ప్రజలకు, కార్యకర్తలకు పార్టీలో విస్తృత భాగస్వామ్యం కల్పించే ఉద్ధేశంతో..ఐటీడీపీ పేరుతో సరికొత్త డిజిటల్ వేదికను తెదేపా అధినేత చంద్రబాబు అందుబాటులోకి తీసుకొచ్చారు.
తెదేపా సరికొత్త డిజిటల్ వేదిక ఐటీడీపీ