కరోనా అనుమానం ఉన్న వారందరినీ ఒకే అంబులెన్స్ లో ఎక్కించటం దుర్మార్గమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. కరోనా కేసుల సంఖ్య పెరిగేకొద్దీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కాపాడే విషయంలో విఫలమవుతున్న తీరు బాధ కలిగిస్తోందన్నారు.
ఒకే అంబులెన్స్‌లో కుక్కి కుక్కి ఎక్కిస్తారా?... ఇంత నిర్లక్ష్యమా ? : చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు
కరోనా అనుమానితులందరినీ ఒకే అంబులెన్స్ కుక్కి కుక్కి ఎక్కించడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. కరోనా కేసులు పెరుగుతున్నా ఇంత నిర్లక్ష్యమా అని ఆవేదన చెందారు. ప్రజలను కాపాడే విషయంలో ప్రభుత్వం విఫలమవుతుందని విమర్శించారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇక దేవుడే కాపాడాలన్నారు. 108 అంబులెన్స్‌ల ప్రచారానికి వెచ్చించిన ఖర్చు ఇందుకేనా అంటూ ధ్వజమెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.
ఇదీ చదవండి :మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Last Updated : Jul 17, 2020, 4:11 PM IST