ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

‘జనవాణి’ని అడ్డుకునేందుకు వైకాపా కుట్రలు దుర్మార్గం : చంద్రబాబు - visakha incident

CBN ON JANAVANI: విశాఖలో వైకాపా ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పవన్​ బస చేస్తున్న హోటల్లో​ సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనమన్నారు.

CBN ON JANAVANI
CBN ON JANAVANI

By

Published : Oct 16, 2022, 2:36 PM IST

CBN ON VISAKHA INCIDENT : జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'జనవాణి' కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైకాపా చేస్తున్న కుట్రలు దుర్మార్గమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒక పార్టీ అధినేత కారులో కూర్చోవాలో లేదా బయటకు వచ్చి అభివాదం చెయ్యాలో కూడా పోలీసులే నిర్ణయిస్తారా అని మండిపడ్డారు. విశాఖలో వైకాపా ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పవన్​ బస చేస్తున్న హోటల్లో​ సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనమన్నారు.

విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన పేరుతో పదుల సంఖ్యలో అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన నాయకులు, కార్యకర్తల్ని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతి అడిగిన నేతలపై హత్యాహత్నం సెక్షన్​ల కింద కేసులు పెట్టి అరెస్టులు చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details