Chandrababu: వైకాపా పతనానికి నిరుద్యోగుల పోరాటమే నాంది: చంద్రబాబు
22:14 July 19
chandrababu fiers on ycp govt
రాష్ట్రంలో వైకాపా పతనానికి నిరుద్యోగుల పోరాటమే నాంది అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యోగ పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలపై ప్రభుత్వo నియంతృత్వంగా ఉక్కు పాదం మోపిందని ధ్వజమెత్తారు. అక్రమంగా అరెస్టు చేసిన నిరుద్యోగ యువతను బేషరతుగా విడుదల చేయాలని ఓ ప్రకటన లో డిమాండ్ చేశారు. విద్యార్థి యువజన సంఘాల పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
"జగన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ హామీనే నిలబెట్టుకోవాలని నిరుద్యోగులు ప్రజాస్వామ్య పద్దతిలో ఆందోళనకు దిగితే అరెస్టు చేయడం దుర్మార్గం. న్యాయమైన డిమాండ్ల పరీష్కారం కోసం నిరసన తెలిపే హక్కు నిరుద్యోగులకు ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరం అన్న రీతిలో పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తోంది." అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:CM Jagan Polavaram Tour: ఏదో కట్టాం అన్నట్టు పునరావాస కాలనీలు ఉండొద్దు: సీఎం జగన్