ఎన్నో సంప్రదింపులు జరిపి... నిరంతరం వెంటపడి లూలూ గ్రూప్‌ను ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించామని... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుతో విశాఖలో వేల ఉద్యోగాలు వచ్చి, ఆర్థిక అభివృద్ధి జరిగేదన్నారు. జగన్ ప్రభుత్వ తెలివితక్కువ నిర్ణయాల కారణంగా... తమ శ్రమంతా వృథా అయ్యిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.
కష్టపడి తీసుకొస్తే... శ్రమంతా వృథా చేశారు: చంద్రబాబు - chandra babu fires on ycp government over lulu decission
ఏపీలో పెట్టుబడులు పెట్టేదిలేదని... లూలూ గ్రూప్ సంస్థ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందిచారు. ప్రభుత్వ చర్యలు వ్యాపార అనుకూల వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు
బాధ్యత లేని ఇలాంటి చర్యలు వ్యాపార అనుకూల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని చంద్రబాబు ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. లూలూ గ్రూప్సంస్థకు ఇలా జరిగినందుకు... చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.