'సమాజహితం కోసం కరోనా నియంత్రణపై ప్రతిఒక్కరూ పోరాడాలి' - చంద్రబాబు నాయుడు ముఖ్యంశాలు
సమాజహితం కోసం ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణకు పోరాడాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆక్సిజన్ అందక, వసతుల కొరతతో ఇబ్బంది పడుతున్న వారికి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సేవలందిస్తుమని తెలిపారు.
సమాజహితం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కరోనా నియంత్రణపై పోరాడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. "కరోనా వేళ సమాజ శ్రేయస్సుకు అవసరమైన సరైన సమాచారం" అన్న అంశంపై ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాల వైద్య నిపుణులతో నిర్వహించిన ఆన్ లైన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పడకలు లేక, ఆక్సిజన్ అందక, వసతుల కొరతతో ఇబ్బంది పడుతున్నందున తమ వంతు బాధ్యతగా ఎన్టీఆర్ ట్రస్టు వేదికగా సేవలందిస్తున్నామని తెలిపారు. కరోనా తగ్గిపోయిందనే భావనతో ప్రభుత్వాలు, ప్రజలు ముందుకెళ్లారని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెండో దశ ఉధృతిని గమనించలేకపోయారన్నారు. కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ అనేది ఇప్పుడు అత్యవసరమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: