వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగించడం... రైతులకు ఉరితాడు లాంటిదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మీటర్ల పేరిట నయవంచనకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రైతులు పోరాడి సాధించుకున్న ఉచిత విద్యుత్ హక్కును కాలరాసేలా వ్యవహరిస్తే... చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత‌్వ తీరు మారకుంటే రాయలసీమ, మెట్ట ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 22ను ఉపసంహరించుకుని... ఉచిత విద్యుత్‌ను యధాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అది నగదు బదిలీ కాదు.. రైతుల మెడకు ఉరితాళ్లు: చంద్రబాబు - chandrababu news
వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ కాదు...రైతుల మెడకు కట్టే ఉరితాళ్లని విమర్శించారు.
తేనె పూసిన కత్తి లాంటి మాటలతో రైతులను మోసం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. అప్పులు చేయటమే ప్రాధాన్యతగా ప్రభుత్వం ముందుకు పోతోందని మండిపడ్డారు. ప్రజలపై గంటకు 9 కోట్ల రూపాయల అప్పు మోపుతున్నారని విమర్శించారు. నిమిషానికి 18లక్షలు, సెకనకు 30 వేల రూపాయలుగా ప్రజలపై అప్పు భారం ఉందని చంద్రబాబు వివరించారు. రాష్ట్రమేమీ జగన్ బానిస కాదన్న చంద్రబాబు...విద్యుత్ రంగంపై తెదేపాకు అన్ని హక్కులు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికింది తెదేపా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు దేశానికే ఆదర్శమని చంద్రబాబు వెల్లడించారు.